ఓడినా.. మనసు గెలుచుకున్న అభ్యర్థి
BDK: భద్రాచలంలో ఇటీవల జరిగిన వార్డు ఎన్నికల్లో 1వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఎ.కృష్ణవేణి ఓడినప్పటికీ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఎన్నికల ముందు డ్రైనేజ్ సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన ఆమె సోమవారం సొంత ఖర్చులతో మురుగునీటి కాల్వల మరమ్మతులు చేపట్టారు. దీంతో బజార్ ప్రాంత ప్రజలు, భక్తులకు ఇబ్బందులు తగ్గాయని కాలనీవాసులు తెలిపారు.