నేడే నవోదయ ప్రవేశ పరీక్ష
SDPT: 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం నవోదయ ప్రవేశ పరీక్ష నేడు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జరగనుంది. ఈ పరీక్షకు మొత్తం 4,754 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. మెదక్ జిల్లాలో 6, సంగారెడ్డిలో 9, సిద్దిపేటలో 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.