నిడదవోలు - హైదరాబాద్‌కు 2 కొత్త బస్సు సర్వీసులు..!

నిడదవోలు - హైదరాబాద్‌కు 2 కొత్త బస్సు సర్వీసులు..!

E.G: నిడదవోలు నుంచి హైదరాబాద్‌కు బుధవారం 2 ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించినట్లు డిపో మేనేజర్ ధనుంజయ రావు తెలిపారు. చౌటుప్పల్ వద్ద డిపో బస్సు ప్రమాదానికి గురవడంతో ఆ సర్వీసును నిలిపివేసి, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా వెంటనే ప్రత్యామ్నాయ బస్సును ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.