నేడు అవుకులో యూరియా పంపిణీ

నేడు అవుకులో యూరియా పంపిణీ

NDL: అవుకు మండల రైతు సేవా కేంద్రంలో శనివారం ఉదయం యూరియా పంపిణీ జరగనుందని మండల వ్యవసాయ అధికారి కలమున్నీసా తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమం వ్యవసాయ శాఖతో పాటు పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల సమన్వయంతో నిర్వహించనున్నట్లు తెలిపారు. మండలంలోని రైతులు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.