PACS ఛైర్మన్ సస్పెండ్ చేసిన.. కాంగ్రెస్ పార్టీ

MLG: జిల్లా కేంద్రంలో ఆదివారం ఇంచెర్ల, జంగాలపల్లి, బరిగలపల్లి, బంజరుపల్లి కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఇంచెర్ల PACS ఛైర్మన్ రాములను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వారు వెల్లడించారు. రాములు పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.