'పత్తి పంటను దళారులకు అమ్మి మోసపోవద్దు'
MBNR: రైతులు పండించిన పత్తి పంటను దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటుచేసిన సీసీఐ కొనుగోలుకేంద్రంలోనే అమ్ముకోవాలని మార్కెట్ కమిటీ ఛైర్మన జ్యోతి అల్వాల్ రెడ్డి సూచించారు. జడ్చర్ల మండలం గొల్లపల్లిలో సోమవారం పత్తి కొనుగోలుకేంద్రాన్ని వైస్ ఛైర్మన్ రాజేందర్ గౌడ్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని ఆమె ఆదేశించారు.