VIDEO: ముగిసిన ఫస్టియర్ వార్షిక పరీక్షలు
ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు గురువారం ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఈ సందర్బంగా నేడు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం 178 మందికి గాను 170 మంది విద్యార్థులు హాజరై 8 మంది గైర్హాజరైనట్లు CS వెంకటకేశవులు తెలిపారు.