కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేసిన మంత్రి శ్రీనివాస్
VZM: గంట్యాడ మండలంలోని కొటారుబిల్లి గ్రామంలో కనకదుర్గమ్మ ఆలయంలో శనివారం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం అర్చకులు మంత్రి శ్రీనివాస్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కనకదుర్గమ్మ తీర్థ మహోత్సవం పురస్కరించుకుని మంత్రి శ్రీనివాస్ ఆలయంలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.