క్రమంగా పెరుగుతోన్న గోదావరి నీటిమట్టం

TG: ఎగువ ప్రాంతాల నుంచి వస్తోన్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 38 అడుగుల వద్ద ఉంది. ఈ నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో గోదావరి నదిలో స్నానాలు ఆచరించే భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. కాగా, ఈ వర్షాకాలంలో భద్రాచలం వద్ద నీటి మట్టం పెరగడం ఇది నాలుగోసారి.