మంత్రి ఉత్తమ్‌కు హరీష్ రావు బహిరంగ లేఖ
TG: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం, దేవాదుల నిర్వహణలో ప్రభుత్వ వైఖరి సరిగా లేదని, ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్నారని పేర్కొన్నారు. పంపులు, మోటార్లు పాడయ్యేలా కావాలనే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మోటార్లు పాడయ్యాయనే నెపాన్ని BRSపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించారు.