ఈ నగరానికి ఏమైంది..?

ఈ నగరానికి ఏమైంది..?

భాగ్యనగరానికి దిష్టి పట్టినట్లుగా కనిపిస్తోంది. ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడుకున్న నగరం. కానీ ఇప్పుడు ఓ పక్క కల్తీ ఆహార పదార్థాలు, మరో పక్క నకిలీ వస్తువులతో సతమతమవుతోంది. ట్రాఫిక్ సమస్య పెరిగి వాతావరణం కాలుష్యం తీవ్రతరమౌతోంది. వరుస అగ్ని ప్రమాదాలతో బెంబేలెత్తిపోతోంది. ఇప్పటికైనా నిర్లక్ష్యానికి ముగింపు పలుకుదాం. బాధ్యతతో నగరానికి కొత్త శ్వాసనిద్దాం.