దెబ్బతిన్న రోడ్డు.. పట్టించుకోని అధికారులు

దెబ్బతిన్న రోడ్డు.. పట్టించుకోని అధికారులు

NRML: రూరల్ మండలంలోని అక్కాపూర్ గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డు గుంతలు పడి అధ్వానంగా మారింది. అధిక బరువుతో నిత్యం పదుల సంఖ్యలో భారీ వాహనాలు వెళ్తుండడంతో రోడ్డు పూర్తిగా దెబ్బతిందని గ్రామస్థులు తెలిపారు. ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.