నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న క్లినిక్ సీజ్
సత్యసాయి: ఓబులదేవర చెరువులో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న హనుమాన్ మెడికల్ స్టోర్‌ను జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒక ఆర్‌ఎంపీ రోగులకు అనుమతి లేకుండా ప్రమాదకర ఇంజక్షన్లు, స్టెరాయిడ్లు ఇస్తూ కలెక్టర్‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. దీంతో అధికారుల బృందం తక్షణమే క్లినిక్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేసింది.