'ప్రపంచ భద్రతే లక్ష్యం'
విశాఖ తీరంలో నిర్వహించిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రపంచ శాంతి, భద్రతే భారత్ ఆకాంక్ష అని, సముద్ర మార్గాల రక్షణలో ఇండియన్ నేవీ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ‘వసుధైవ కుటుంబకం’ స్ఫూర్తితో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత్‌తో పాటు పలు దేశాల నౌకలు పాల్గొనడం అభినందనీయమన్నారు.