గొర్రెల దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు
WGL: ఖానాపురం మండల కేంద్రంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులు గొర్రెల దొంగలను అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ నుంచి నర్సంపేట వైపు వెళుతున్న ఆటోలో నలుగురు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని ఆపి విచారించగా, వారు ఐదుగురి గొర్రెలను దొంగిలించినట్లు వెల్లడించారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై రఘుపతి తెలిపారు.