కుప్పంలో ఓటు వేసిన భరత్

CTR: కుప్పం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుప్పంలో ఓటు వేశారు. తన భార్య దుర్గతో కలిసి భరత్ కుప్పం పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఓటు వేసేందుకు ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ కేంద్రం వద్దకు ఓటర్లు క్యూ కట్టగా ఓటర్లతో కలిసి భరత్ తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.