సముద్ర స్నానాలకు విస్తృత ఏర్పాట్లు
కృష్ణా: కార్తీక పౌర్ణమి సందర్భంగా మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో బుధవారం ఉదయం 4 గంటలకు సముద్ర హారతి పుణ్య స్నానాలు ప్రారంభం కానున్నాయి. సుమారు రెండు లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున అధికారులు విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను కూటమి నేతలు స్వయంగా పరిశీలించారు.