బాలకృష్ణకు పద్మభూషణ్.. హిందూపురంలో సన్మానం

AP: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఇవాళ ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించనున్నారు. ఆయనకు పద్మభూషణ్ పురస్కారం లభించిన సందర్భంగా.. హిందూపురం నియోజకవర్గ ప్రజల తరపున సాయంత్రం గౌరవసన్మాన కార్యక్రమం జరగనుంది. కాగా, ఇటీవల కళాసేవకు గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డును బాలకృష్ణ అందుకున్న విషయం తెలిసిందే.