మరోసారి ఛాంపియన్‌గా NCC సికింద్రాబాద్ గ్రూప్
HYD: NCC డైరెక్టరేట్ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పరిధి 9 గ్రూపుల మధ్య నాలుగో సారి వరుసగా సికింద్రాబాద్ గ్రూప్ ఛాంపియన్‌గా అవతరించింది. 2026 అభినందన కార్యక్రమంలో, ఎయిర్ కమోడోర్ నర్సింగ్ సైలాని చేతుల మీదుగా సికింద్రాబాద్ గ్రూప్ కమాండర్ కర్నల్ కుమార్‌కు ఛాంపియన్‌షిప్ బ్యానర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీసీ కంటింజెంట్, డైరెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.