'ఉగ్రదాడిలో మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉంటాం'

'ఉగ్రదాడిలో మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉంటాం'

కర్నూలు: ఉగ్ర దాడిలో మృత్యువాత పడిన కుటుంబాలకు అండగా నిలుస్తామని వైసీపీ మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పిస్తూ ఆదివారం కొండారెడ్డి బురుజు ఎదురుగా వైసీపీ నాయకులతో కలిసి కొవ్వొత్తులతో ర్యాలీని నిర్వహించారు. హిందుస్థాన్ జిందాబాద్ పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.