మడకశిర చెరువులకు కృష్ణా నీరు అందించాలి: ఎమ్మెల్యే

సత్యసాయి: అనంతపురం R&B గెస్ట్ హౌస్‌లో బుధవారం హంద్రీనీవా, ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. మడకశిర ఎమ్మెల్యే ఎమ్.ఎస్ రాజు మాట్లాడుతూ.. గొల్లపల్లి రిజర్వాయర్ నుండి కృష్ణా నీరు హంద్రీ కాలవల ద్వారా మడకశిర చెరువులకు చేరడం లేదని తెలిపారు. ఈసారి తప్పనిసరిగా చెరువులు నింపాలని సూచించారు. కార్యాక్రమంలో హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి కూడా పాల్గొన్నారు.