టీచర్ల వేధింపులు తాళలేక.. విద్యార్థి ఆత్మహత్య

టీచర్ల వేధింపులు తాళలేక.. విద్యార్థి ఆత్మహత్య

రాజస్థాన్ కరౌలి జిల్లాలో దారుణం జరిగింది. ధంగడ్ కా పురాకు చెందిన 14 ఏళ్ల అంకిత్.. కమలా భారతీయ శిక్షాణ్ సంస్థాన్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. అయితే ఈ నెల 18న ఇంటిలో ఉరివేసుకుని చనిపోయాడు. పాఠశాలలో టీచర్లు బాబులాల్, షహన్షాతో పాటు స్కూల్ నిర్వాహకుడు తనను కొట్టి వేధించారని.. అందుకే చనిపోతున్నట్లు సూసైడ్ నోటులో రాశాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది.