VIDEO: పెనుకొండలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష
సత్యసాయి: పెనుకొండలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న PRC, DA బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు. దీక్షలో యూటీఎఫ్ నాయకులు నారాయణ స్వామి, తదితరులు పాల్గొన్నారు.