VIDEO: ఉద్ధృతంగా వరద నీరు.. నిలిచిన రాకపోకలు

NZB: రుద్రూర్ మండలంలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో బొప్పాపూర్ గ్రామానికి వెళ్లే లోలెవల్ బ్రిడ్జిపై నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రుద్రూర్ - బొప్పాపూర్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి వాగులు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.