25 రోజుల్లోనే వితంతు పెన్షన్ మంజూరు

25 రోజుల్లోనే వితంతు పెన్షన్ మంజూరు

ATP: కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామానికి చెందిన మారెక్కకు 25 రోజుల్లోనే వితంతు పెన్షన్ మంజూరు కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసారు. అనారోగ్యం కారణంగా మరెక్క భర్త ఆంజనేయ్య 25 రోజుల క్రితం మృతి చెందాడు. అయన భార్య మారెక్క వితంతు పెన్షన్ దరఖాస్తు చేసుకొంది. కేవలం 25 రోజుల్లోనే పెన్షన్ మంజూరు ఐయ్యి నేడు పెన్షన్ అందుకోవడం జరిగింది.