బద్వేల్ ప్రజలకు బంపర్ ఆఫర్

KDP: బద్వేల్ ప్రజలకు పురపాలక సంఘం బంపర్ ఆఫర్ ఇచ్చింది. 2024-25 వరకు ఆస్తి పన్ను బకాయిలు ఏకకాలంలో చెల్లిస్తే 50% వడ్డీ మాఫీ, 2025-26 సంవత్సరపు పన్ను కూడా కలిపి చెల్లిస్తే అదనంగా 5% రిబేట్ లభిస్తుందని కమిషనర్ వి.వి. నరసింహారెడ్డి పేర్కొన్నారు. 30లోపు చెల్లిస్తే రాయితీ వర్తిస్తుందని ఆయన తెలిపారు.