నేపాల్ నుంచి క్షేమంగా వచ్చిన తెలుగు యాత్రికులు

నేపాల్ నుంచి క్షేమంగా వచ్చిన తెలుగు యాత్రికులు

AP: నేపాల్‌లో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు సురక్షితంగా రాష్ట్రానికి చేరుకున్నారు. నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానం 6E 9511 విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. ఈ విమానంలో మొత్తం 144 మంది తెలుగు యాత్రికులు ఉన్నారు. వీరిలో 104 మంది విశాఖ వాసులు కాగా, మిగిలిన 40 మంది యాత్రికులతో కూడిన విమానం తిరుపతికి వెళ్లనుంది.