అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి - ఎమ్మెల్యే
VZM: తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో లక్కవరపుకోట మండల కేంద్రంలో గల స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మండల అధికారులతో ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సోమవారం రివ్యూ సమావేశం నిర్వహించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, అధికారులు సూచనలు పాటిస్తూ సహకరించాలని కోరారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దన్నారు.