ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

అన్నమయ్య: ఓబులవారిపల్లి మండలం మంగంపేట బాలాజీ ఫ్యామిలీ రెస్టారెంట్ వద్ద సోమవారం ఉదయం పల్సర్ బైక్, స్కూటీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయ తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. అనంతరం వెంటనే వారిని ఆంబులెన్స్‌లో రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.