VIDEO: ట్యాంక్ బండ్ వద్ద సంవిధాన్ శక్తి రన్
HYD: జాతీయ న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ ఏక్ నయీ దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంవిధాన్ శక్తి రన్‌ను నిర్వహించారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న సంజీవయ్య పార్క్ నుంచి 3K, 5K రన్ చేశారు. ప్రజలందరికీ రాజ్యంగం విలువ తెలియజేయాలని ఉద్దేశంతోనే ఈ పరుగు తీశారు. ఈ కార్యక్రమంలో భారీగా యువత, విద్యార్థులు, న్యాయవాదులు పాల్గొన్నారు.