మాక్ అసెంబ్లీలో స్పీచ్ అదుర్స్

మాక్ అసెంబ్లీలో స్పీచ్ అదుర్స్

KRNL: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మాక్ అసెంబ్లీలో కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా దయాన వ్యవహరించిన తీరు ప్రశంసనీయమని కర్నూలు అర్బన్ ఎంఈవో -2 అబ్దుల్ రెహమాన్ అన్నారు. బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థిని దయానకు ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా సోలార్ ప్లాంట్ అంశంపై ఇచ్చిన స్పీచ్ అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మేరీ సునీత పాల్గొన్నారు.