అందరిని అక్షరాస్యులను చేయడమే అక్షరాంధ్ర లక్ష్యం
కోనసీమ: గ్రామీణ ప్రాంతాలలో ప్రజలందరినీ అక్షరాస్యులను చేయడమే అక్షరాంధ్ర లక్ష్యమని ఆత్రేయపురం ఎంపీడీవో వెంకట్రామన్ అన్నారు. ఆయన ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయం వద్ద అక్షరాంద్ర కార్యక్రమం నిర్వహణపై అంగన్వాడీ టీచర్లు, వివోఏలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్షరాంధ్ర ద్వారా చేపట్టే ప్రతి కార్యక్రమం గురించిన విషయాలను ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు.