VIDEO: ఇప్ప పువ్వు సేకరణపై అవగాహన కార్యక్రమం

MLG: వెంకటాపూరం మండలం బండ్లపాడు గొత్తికోయగూడెంలో అటవీశాఖ ఆధ్వర్యంలో శనివారం అడవిలో అగ్ని ప్రమాదాల నివారణ, ఇప్పపువ్వు సేకరణపై ఎస్ఆర్ఏ డోలి శంకర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడవుల్లో మంటలు అంటించరాదని, ఒకవేళ అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఇప్ప పువ్వును సేకరించి వివిధ రకాల ఉత్పత్తులు చేయాలని సూచించారు.