రోడ్డు వద్ద అదుపుతప్పిన స్పిరిట్ ట్యాంకర్

రోడ్డు వద్ద అదుపుతప్పిన స్పిరిట్ ట్యాంకర్

NLR: వెంకటాచలం మండలం గొలగమూడి రోడ్డు సమీపంలో స్పిరిట్‌తో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. రాజమండ్రి నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు డ్రైవర్ తెలిపాడు. ట్యాంకర్‌లోని స్పిరిట్ మొత్తం రోడ్డు మయం అయ్యింది. పోలీస్, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.