శిశు మరణాలపై అప్రమత్తం

SKLM: శిశు మరణాలపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళంలోని కలెక్టరేట్లో శుక్రవారం ఆయన వైద్యా ధికారులతో సమావేశం నిర్వహించారు. గత నాలుగు నెలల్లో 12 శిశు మరణాలు జరిగాయన్నారు. ఈ మేరకు వైద్య సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. మాతాశిశు సంరక్షణ అధికారులు అత్యంత శ్రద్ధ వహించాలని అన్నారు.