సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ముగిసిన తనిఖీలు
AP: రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు ముగిశాయి. రెండు రోజులపాటు ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లోకి భారీగా నగదు బదిలీ అయినట్లు పేర్కొన్నారు. అవినీతిపై ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.