శుక్రవారం సభ ఒక పరిష్కార వేదిక

KNR: మహిళా సమస్యలన్నింటికీ శుక్రవారం సభ ఒక పరిష్కార వేదికగా నిలుస్తుందని జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి అన్నారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలోని మార్కండేయనగర్ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ అధికారి సరస్వతి మాట్లాడుతూ.. ప్రతి గర్భిణీ మహిళా, బాలింత సభకు హాజరు కావాలన్నారు.