మోటర్ సైకిల్ దొంగతనం.. సీసీ ఫుటేజ్ దృశ్యాలు
ప్రకాశం: కనిగిరి పట్టణంలో బైక్ చోరీ ఘటన చోటుచేసుకుంది. స్థానిక లేపాక్షి డ్రైఫ్రూట్స్ వనం షాపు వద్ద ఓ వ్యక్తి తన మోటార్ సైకిల్‌ను పార్క్ చేసి సమీపంలోని సూపర్ మార్కెట్‌లో సరుకులు కొనడానికి వెళ్లాడు. ఇది గమనించిన మరో వ్యక్తి, ఆ మోటార్ సైకిల్‌ను సులభంగా నడిపించుకుంటూ అక్కడి నుంచి తీసుకెళ్లాడు. సీసీ ఫుటేజ్ దృశ్యాలను యజమాని పోలీసులకు అందించారు.