ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన ఎంపీడీవో
NZB: సాలూర మండలం హున్సలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ ఇవాళ పరిశీలించారు. ఈ మేరకు నిర్మాణ నాణ్యత, పురోగతిపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ.. గృహాల నిర్మాణంలో ఎలాంటి ఆలస్యం జరగకుండా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పనులు వేగవంతం చేయాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సంబంధిత లబ్ధిదారులకు ఎంపీడీవో సూచించారు.