'దశల వారిగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తా'

'దశల వారిగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తా'

ADB: సోనాల మండలంలోని ఘనపూర్ గ్రామాన్ని దశలవారీగా అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ బోత్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆడే గజేంద్ర పేర్కొన్నారు. మంగళవారం గ్రామస్తుల కోరిక మేరకు గ్రామాన్ని సందర్శించి గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు.