మెట్రో వేళలపై ప్రయాణికుల అసంతృప్తి
హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలు రాత్రి 11 గంటలకే నిలిచిపోవడంతో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు 11.45 గంటల వరకు అందుబాటులో ఉండగా, ఇప్పుడు ఉద్యోగాలు, వ్యాపారాలు ముగించుకునేవారికి, ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు ఇబ్బందిగా మారింది. అయితే, మెట్రో వేళలను మళ్లీ అర్ధరాత్రి వరకు పొడిగించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.