జగన్‌పై మంత్రి మండిపల్లి ఆగ్రహం
AP: తిరుమల పరకామణిలో చోరీ చేసిన వ్యక్తిని జగన్ వెనకేసుకొస్తున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. నిందితుడు పశ్చాత్తాపం పడుతుంటే.. జగన్ మాత్రం చిన్న తప్పంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకామణి కేసులో ఎవరిని రక్షించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. పరకామణి చోరీపై ఆయన ఎందుకు అంతలా స్పందిస్తున్నారని నిలదీశారు.