వృద్ధాశ్రమంలో ఘనంగా మాతృ దినోత్సవ వేడుకలు

NLG: దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృ దినోత్సవ వేడుకల్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహిళా వృద్ధాశ్రమంలో అధ్యక్షుడు ఎన్వీటీ, అధ్యక్షురాలు సంధ్యారెడ్డి, సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వృద్ధాశ్రమంలో ఉన్న అమ్మలందరికీ భోజనాలు పండ్లు బ్రెడ్స్ ప్యాకెట్ పంపిణీ చేశారు.