రైలు కింద కిందపడి వ్యక్తి మృతి

ప్రకాశం: రైలు కిందపడి ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన ఒంగోలు - కరవది రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు.