'ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'
VZM: ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగు ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ సెక్రటరీ ఎ.అశోక్ మాట్లాడుతూ.. ప్రతినెల 10వ తేదీలోపు జీతాలు ఆయా కాంట్రాక్టరు ద్వారా కార్మికుడి బ్యాంకు ఖాతా నందు జమ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.