'మన బడి-మన నీరుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి'
ADB: మన బడి-మన నీరు కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని DPO రమేష్ అన్నారు. గురువారం జైనథ్ మండలం కేంద్రంలోని ZPHS పాఠశాలలో మన బడి-మన నీరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పోస్టల్ ఆవిష్కరించి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సుధీర్ కుమార్, పంచాయతి కార్యదర్శి అబ్దుల్ ముజీబ్,HM, సిబ్బంది, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.