'మున్సిపల్ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి'
ప్రకాశం: ఎపీ మునిసిపల్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం కనిగిరిలో మునిసిపల్ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లించాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎఐటీయూసీ అధ్యక్షులు సయ్యద్ యాసిన్ పాల్గొన్నారు. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించి, పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లించకపోతే సమ్మె నిర్వహిస్తామని తెలిపారు.