'568 మందికి ఫ్రూట్ కవర్ల పంపిణీ'

CTR: పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో 568 మంది రైతులకు ఫ్రూట్ కవర్లు పంపిణీ చేసినట్లు ఉద్యానవన అధికారిణి సంతోషి కుమారి తెలిపారు. సరాసరి ఒక్కొక్క రైతుకు 8 వేల కవర్లు చొప్పున 40 లక్షల ఫ్రూట్ కవర్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఇంకా కొంతమంది రైతులు ఫ్రూట్ కవర్లు కావాలని వస్తున్నారని.. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు.