మాజీ ఉపరాష్ట్రపతి కి సత్కారం
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రెండు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా కడప R&B అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా శనివారం సిద్ధవటం మాజీ జడ్పీటీసీ సభ్యుడు చలమయ్య యాదవ్, ఒంటిమిట్ట మాజీ ఎంపీపీ లక్ష్మీనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు సమస్యలపై ఆయనకు విన్నవించారు.