డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ఇవాళ ఉదయం డిగ్రీ కళాశాలలో మార్నింగ్ వాక్ చేశారు. అనంతరం పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా రూ. 17 కోట్లతో నిర్మిస్తున్న డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.